అనాధ పిల్లల నడుము జనసేన నాయకురాలు పాలవలస యశస్వి పుట్టినరోజు వేడుకలు

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జనసేన నాయకురాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం రాత్రి కంటోన్మెట్ లో బ్రైట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనాధశ్రమంలో జరుపుకున్నారు. ముందుగా పిల్లల మధ్య భారీకేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించి, విద్యార్థులకు స్వీట్లు,బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా పుట్టినరోజును అనాధ పిల్లల మధ్య జరుపుకోవడం కొత్త ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని, పుట్టినరోజును పురస్కరించుకొని మా జనసైనికులు, వీరమహిళలు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభిందనీయమని అన్నారు. ఈ సందర్బముగా జిల్లా నలుమూలనుండి, మరియు పట్టణంనుండి భారీ ఎత్తులో అభిమానులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళ మాతా గాయిత్రి, మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనగళ్ల రాజు, భారీసంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  మండపేటలో టీడీపీ, వైసీపీ నుండి జనసేనలో చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి