ఆవిర్భావ దినోత్సవ సభను అడ్డుకోవడం సమంజసం కాదు: దాచేపల్లి మండల జనసేన నాయకులు

    దాచేపల్లి, (జనస్వరం) : దాచేపల్లి మండల పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ మండల నాయకులు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వైసిపి నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని సభకు అడ్డంకులు సృష్టించడం సమంజసం కాదని, ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్ లను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని బెదిరించినట్లు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీగా సభలు, సమావేశాలు చేసుకునే నైతిక హక్కును కాలరాసే విధంగా పోలీసులు వ్యవహరించడం ప్రజల స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. మీరు ఎంత బయపెట్టాలని చూస్తే అంతకు రెట్టింపుగా సభను విజయవంతం చేస్తాం తప్ప మీ తాటాకు చప్పుళ్లకు బయపడే ప్రసక్తే లేదని మండల పార్టీ అధ్యక్షుడు మందపాటి దుర్గారావు పేర్కొన్నారు. సభను జయప్రదం చేసే విధంగా ప్రజలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, మండల నాయకులు సొంటెం కొండలు, కోట మధు, కిచ్చంశెట్టి లక్ష్మీనారాయణ, అంబటి స్వామి, sc నాయకులు పాముల కిషోర్, జక్కా సుబ్బయ్య, గురజాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి