క్రియాశీలక సభ్యత్వాల కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

    విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వాలు ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని, దాన్ని ప్రతీఒక్కరికీ తెలిసేలా సోషల్ మీడియాలలో జనసైనికులంతా ప్రచారం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పాలవలస యశస్వి అన్నారు. శనివారం క్రియాశీలక సభ్యత్వాల శిబిరాలను విజయనగరం నియోజకవర్గ పరిధిలో ద్వారపూడి, గుంకలాం గ్రామాల్లో నిర్వహించి, ఆయా గ్రామాల్లో పర్యటించి సభ్యత్వాలకోసం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఏరాజకీయ పార్టీకూడా ఇంతవరకు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించలేదని,కేవలం జనసేన పార్టీకి మాత్రమే చెల్లిందని, ఈ అవకాశాన్ని ప్రతీఒక్క కార్యకర్త వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. గ్రామాల్లో వైస్సార్సీపీ పాలనపై ప్రజలంతా ఎంతో విసుగు చెందారని,పవన్ రావాలి, పాలన మారాలి అని అందరూ జనసేనకు మద్దతు ఇస్తూ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు), లాలిశెట్టి రవితేజ, మిడతాన రవికుమార్, బొబ్బాది చంద్రనాయుడు, ఆర్.ఎర్నాయుడు, సైలాడ అనిల్, ద్వారపూడి, గుంకలాం గ్రామం నుంచి భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  మహిళా సాధికారత జనసేన టీడీపీ బీజేపీపార్టీలతోనే సాధ్యం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి