బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల సమస్యలను గాలికి వదిలేసి సన్మానాలు, ఊరేగింపులు చేయించుకుంటున్నారని వాపోయారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మురుగు కాలువల వల్ల దోమలతో, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను, వృద్ధులను పట్టించుకోకుండా గుర్రాల మీద ఊరేగింపు చేయించుకుంటూ ఉన్నారు. కొత్త బస్టాండు దగ్గర ఉన్న తూర్పు సత్రంలో స్థలం కులమతాలతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. గరుడాచలం నాయుడు ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఆయన విగ్రహాన్ని కొత్త బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.