
కూలీ హమాలీలకు బట్టలు పంపిణీ చేసిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన నాయకులు శ్రీరుషి, శ్రీగుగ్గీల్ల నాగార్జున, శ్రీ నేతీరాచయ్య, శ్రీ అంజి, శ్రీ వేంకటసుబ్బయ్యగార్ల ఆధ్వర్యంలో కడప పాత మార్కెట్లో నిత్యం కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే హమాలీలకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారు పాల్గోని ఆయన చేతుల మీదుగా అందజేశారు. రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ తన చేతుల మీదుగా నిర్వహించేలా చేసిన మా మిత్రులు రుషి గారికి, గుగ్లీల్ల నాగార్జున గారికి, నేతీ రాచయ్య గారికి, అంజి గారికి వెంకట సుబ్బయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నరసింహ సాంబ, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, గంగాధర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.









