కమిషనర్ భాను ప్రకాష్ ని వెంటనే బదిలీ చేయాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ బాపట్ల పట్టణ పరిధిలోని మురుగు కాలవలలొ మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని, మున్సిపల్ ఆఫీస్ ఎదురు ఉన్న మురుగు కాలువలు చెత్త పూడుకుపోయి దోమకాటు వల్ల జ్వరాలు వస్తూ ఇబ్బందులు పడుతున్న పట్టణంలోని దివ్యాంగులు వృద్ధులు ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కమీషనర్ పట్టీపట్టనట్లుగా చూస్తూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వము బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రకాష్ గారిని వెంటనే బదిలీ చేయవలసిందిగా జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని, దండు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

See also  విజయవాడ 38 వ డివిజన్ జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు