ఉద్యోగులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం : కదిరి జనసేనపార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్

    కదిరి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు అలవికాని హామీలు ఇచ్చి, అందులో భాగంగా ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తామని, వారికి జీతాలు పెంచుతామని అలాగే పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని, నిరుద్యోగులకు జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రకరకాల అబద్ధపు హామీలు గుప్పించి, గద్దెనెక్కిన తర్వాత అవి అమలు చేయలేక వారికి జీతాలు కూడా ఒకటో తారీఖున ఇవ్వలేక పిఆర్సిని కూడా ఐఆర్ కన్నా తక్కువ ఇస్తూ పింఛన్ దారులను కూడా మోసం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్థులు రోడ్డు ఎక్కడం జరిగింది. దీనికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక రాజకీయ పార్టీగా ఉద్యోగుల తరఫున, నిరుద్యోగులు తరఫున వారికి మద్దతు తెలపడం మా వంతు బాధ్యత. కానీ వైసిపి నాయకులు, ప్రభుత్వ సలహాదారులు మా అధ్యక్షుని విమర్శించడం ఎంతవరకు సమంజసం, మీరు ఇచ్చిన హామీలను ఉద్యోగస్తులు అమలు చేయమంటే వారికి ఆ హామీల అమలు చేయకపోగా వారిపై మీ వాలంటీర్ల ద్వారా వారికి వ్యతిరేకంగా పాంప్లెట్లు పంచడం ఎంతవరకు సమంజసం అని కదిరి జనసేన పార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ ప్రకటనలో తెలియజేశారు. అలాగే మన రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టుల విషయంలో మన ఎంపీలు నోరు విప్పకపోవడం దారుణాతి దారుణం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటాను ఇవ్వకపోవడం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కడప, బెంగళూరు రైల్వే మార్గం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియకుండా ఉంది. అలాగే కదిరి పుట్టపర్తి రైల్వే లైన్ అని చెప్పి సర్వే కూడా చేసినదానికి ఇంతవరకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  దానిని ముందుకు తీసుకోలేకపోవడం ఆయన చేత కాని తనానికి నిదర్శనం. ఈ ప్రభుత్వానికి తన హామీలను నెరవేర్చాలని అనుకుంటే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతభత్యాలను ఇచ్చి అలాగే మన రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా డబ్బులు జమ చేసి రైల్వే ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము.

See also  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జనసేన పార్టీని రౌడీ పార్టీ అనడం చాలా నీచమైన హేయమైన చర్య