కైకలూరు నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     కైకలూరు, (జనస్వరం) :  కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలోని పెద్దగొన్నూరు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఎదుగుదల మరియూ మండలంలో ఉన్న అనేక సమస్యలు గురించి చర్చించి ప్రతి ఒక్క జనసైనికులు, నాయకులు పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల నాయకులు గుడిసేవ సురేష్, నియోజకవర్గ, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 27వ రోజు సేవా కార్యక్రమాలు