మడకశిర మండలంలో 30 మంది యువకులు జనసేనపార్టీలోకి చేరిక

    మడకశిర, (జనస్వరం) :  అనంతపురం జిల్లా మడకశిర మండలం మాణురు పంచాయితీ నుండి 30 మంది యువకులు జనసేనలోకి T. శివాజీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకీ యువకులను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలాలు రేపటి తరం భవిష్యత్తు కోసం నాంది పలకాలని, యువకులే రాజకీయంలో గట్టి పునాది అని చెప్పడంతో ఆయన మాటలకు ప్రభావితమై జనసేన పార్టీ లోకి చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

See also  జెన్ కో ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలంటూ JAC కి మద్దతు ప్రకటించిన నెల్లూరు జనసేన నాయకులు