గుంతకల్లు నియోజకవర్గ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

    గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో గుత్తి మండల అధ్యక్షుడు పోతురాజు చిన్న వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల కమిటీ ఏర్పాటు మరియు జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థంగా కష్టపడే నిస్వార్థ జనసైనికులకు పార్టీ కార్యవర్గ కమిటీలో పెద్దపీట వేయడం జరుగుతుంది, రాబోయే రోజుల్లో కమిటీ సభ్యులందరూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రజాక్షేత్రంలో జనసైనికులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతూ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పాటిల్ సురేష్, బోయ గడ్డ బ్రహ్మయ్య, బండి శేఖర్, కరిడికొండ రామచంద్ర, చాంద్, ఖాదర్ వలీ, హేమంత్, కార్తీక్, ఆసిఫ్, రాజు, భరత్, ఓబులేసు, గంగాధర్, నాగేష్, సూరి, రామాంజనేయులు, విక్రమ్, రుబా, నాగేంద్ర లతోపాటు పలువురు నాయకులు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.

See also  ఆత్మకూరులో 3 రోజు ఘనంగా పవనన్న ప్రజా బాట కార్యక్రమం