సూళ్లూరుపేట జనసేనపార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

   సూళ్లూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సూళ్లూరుపేట నియోజక వర్గం దొరవారిసత్రం మండలం మేలంతూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. క్రికెట్ పోటీలకు మొదటి బహుమతి 5116 , రెండో బహుమతి 2500 నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బురకాల లీలా మోహన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మహిళలకు ముగ్గుల పోటీలకు మొదటి బహుమతి రైస్ కుక్కర్, రెండో బహుమతి నాన్ స్టిక్ పెనుము, మూడో బహుమతి శారీని సూళ్లూరుపేట నియోజకవర్గం మహిళా నాయకురాలు బురకాల గీతాంజలి గారి చేతుల మీదగా మరియు ఆ గ్రామం సర్పంచ్ మణియ్య గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు, మహిళలు పాల్గొనడం జరిగింది.

See also  ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు : జనసేన నాయకులు గుడివాడ రామకృష్ణ