విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో పూర్తయిన టిట్కో ఇల్లులు లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇవ్వాలని జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి పాలవలస యశస్వి డిమాండ్ చేసారు. ఈ విషయమై జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలక్టరేట్ ముందు, కోవిడ్ నిబంధనలతో శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిననంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారికి వినతిపత్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు పక్కాఇళ్ల పేరిట నిర్మించిన టిట్కో ఇళ్లులు ఇప్పటికి కూడా అర్హులకు చేరలేదని, గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో నిర్మితమైన ఇళ్లను పేదవాళ్లకు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారని, ఆనాడు డబ్బులు కట్టిన పేదవాళ్లు ఈనాటికి వడ్డీలు కడుతూ, పెరిగిన ధరలను తాళలేక, అద్దెలు కట్టుకోలేక దయనీయ స్థితిలో జీవిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్నికల వాగ్ధానంగా టిట్కో ఇళ్లను ఉచితంగా ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాన్ని మరిచి జగనన్న గృహకల్పన పేరుతో పేదల సొంత ఇంటి కలను మరింత జటిలం చేశారు. వారు ప్రేవేశపెట్టిన ఇళ్ల పధకంలో ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్పి, గత ప్రభుత్వం ఇస్తానన్న ఇళ్లకు గతంలో మాదిరిగానే డబ్బులు కట్టాలని చెప్పడం విడ్డూరమని, ఇదంతా ఒక ప్రణాళిక లేకుండా జరుగుతుందని, ఏడున్నర సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేకపోయాయని ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ కళ్ళు తెరచి ఇల్లు లేని పేదలకు ఉచితంగా గృహాలు ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో లబ్ధిదారులను, ప్రజలను కలుపుకుని ఈ పోరుని ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు, త్యాడరామకృష్ణారావు(బాలు), జనసేన కార్పొరేట్ అభ్యర్థులు పొట్నూరు చందు, హుస్సేన్ ఖాన్, దాసరి యోగేష్, పళ్లెం కుమారస్వామి, తాడ్డి వేణుగోపాల్, రవిరాజ్ చౌదరి, కిలారి ప్రసాద్, లాలిశెట్టి రవితేజ, దుర్గేష్, బూర్లీ విజయ్, మిడతాన రవికుమార్, ఎర్నాగుల చక్రవర్తి, సాయి తదితరులు పాల్గొన్నారు.