ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్న రాష్ట్ర సమన్వయ కార్యదర్శి భవాని రవికుమార్

భవాని రవికుమార్

         అనంతపురం ( జనస్వరం ) : ఉరవకొండ మండల పరిధిలోని అమిద్యాల గ్రామంలోని అనిల్ అనే వ్యక్తి 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జనసైనికుడు అజయ్ ఈ సమస్యను సామాజిక మధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసి జిల్లా నాయకులకు తెలపడం జరిగింది. వెంటనే స్పందించిన జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి  భవాని రవికుమార్ గత నెల అమిద్యాల గ్రామానికి వచ్చి బాధితుడిని పరామర్శించి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి నెలా పది వేల రూపాయలు చొప్పున సంవత్సరం పాటు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఉరవకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బోయ చంద్రశేఖర్ చేతుల మీదుగా బాధితుడికి ఈరోజు పది వేల రూపాయలు అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హుసేన్, చోటు, ఉరవకొండ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు