రాష్ట్ర గిరిజన నాయకుడు తుమ్మి అప్పలరాజు దొర జనసేన పార్టీలోకి చేరిక

●జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో చేరిక

● జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకోసమే పార్టీలో చేరానని వెల్లడి

      విజయనగరం, (జనస్వరం) : ఉత్తరాంధ్రా వీరమహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ భర్త, రాష్ట్ర గిరిజన నాయకుడు, ప్రజా ఉద్యమ నాయకుడు, తుమ్మి అప్పలరాజు దొర విశాఖపట్నం ఉత్తరాంధ్రా జనసేనపార్టీ కార్యాలయంలో బుధవారం నాడు రాష్ట్ర జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ సరికొత్త నూతన రాజకీయాలకు నాంది పలికిందని, పవన్ కల్యాణ్ పోరాటపటిమ ఎంతో మంది రాజకీయాలకు అతీతంగా ఆకట్టుకుందని, ఇటువంటి స్ఫూర్తితోనే, ఎన్నో ప్రజాపోరాటాలు చేసిన తుమ్మిఅప్పలరాజు దొర పార్టీలో చేరానని, ఈయన జనసేన పార్టీలో చేరడం విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎంతోకృషి చేస్తుందని అన్నారు. నాయకులు తుమ్మి అప్పలరాజు దొర మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, 2024లో జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురాటానికి నా శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, విశాఖ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్, నెల్లిమర్ల జనసేన నియోజకవర్గం నాయకులు బూర్లి విజయ్ శంకర్, దిండి రామారావు, పతివాడ అచ్చుం నాయుడు, పిన్నింటి రాజారావు, తొత్తడి సూర్యప్రకాష్, లింగం రమేష్, జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, విజయనగరం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు డోల రాజేంద్ర ప్రసాద్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.

See also  ప్రజాస్వామ్యాన్ని హరించేలా వైకాపా పాలన : జనసేన నాయకులు కొటికలపూడి గోవిందరావు