రెండేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారి విశ్లేషణ

వైసీపీ

   వైసీపీ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రభుత్వ పాలన గురించి విశ్లేషణ చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు… 

  • మొట్ట మొదటసారిగా ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ రెండూ విఫలం అయ్యాయి. 
  • ఈ పార్లమెంటరీ ప్రజా వ్యవస్థలో ప్రతిపక్షం, మీడియా, న్యాయ వ్యవస్థ ఒక భాగం. కానీ, గడిచిన రెండు ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్షానికి ఉన్న గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న మీడియాను భయభ్రాంతులకు గురి చేయడం, న్యాయ వ్యవస్థ మీద ఆ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూశాం. 
  • రాజ్యాంగం మనకు కల్పించిన ” అందిరికి సమన్యాయం ” అనే వ్యవస్థను తుంగలో తొక్కారు. 
  • ప్రజలచేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ, ఒక పార్టీకే కొమ్ము కాయడం దారుణం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు కానీ, వైయస్సార్ ప్రభుత్వం అని అనరు. 
  • గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ తప్పొప్పులను ప్రశ్నించిన వారి మీద అన్యాయంగా కేసులు పెట్టి వేధించడం చూశాం. జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యమాన్ని ఎంత అపవిత్రం చేశారో కళ్ళారా చూశాం. 
  • రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలు అనే విషయాన్ని మరిచి, ఈ ప్రభుత్వం పూర్తిగా నియతృంత్వ ధోరణి పరిపాలన సాగించడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తోంది. 
  • గత రెండేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలోకి కూరుకపోయింది. రాష్టం విడిపోయినపుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఇపుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పొంతన లేదు. 
  • ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 4.47 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ ప్రభుత్వ౦ వచ్చినప్పటి నుండి 1.60 లక్షల కోట్ల అప్పు చేసింది. వీటిని బట్టి చూస్తే అప్పులు చేస్తేనే రాష్ట్రాన్ని నెగ్గుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
  • ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచుకుంటూ పోతోంది. కానీ, ఆదాయ మార్గాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. గత రెండేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవు. పరిశ్రమ రంగాన్ని వెనక్కి నెట్టేయడమే కాకుండా పూర్తిగా నిరుద్యోగులను మరింత వెనక్కి నెట్టేసేలా ప్రభుత్వ తీరు కనిపిస్తోంది. 
  • మన రాష్ట్రం ” ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ” లో దేశంలోనే నెం.1 గా ఉంది. కానీ పరిశ్రమలు ఎందుకు రావట్లేదు ? ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. పక్క రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక పరిశ్రమలు రప్పించుకోవడంలో విజయవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. మన రాష్ట్రం అట్టడుడుగుకి వెళ్తున్న చోద్యాన్ని చూస్తున్నాం. 
  • దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మోహన్ దాస్ ఫాగి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం ఉందని వ్యాఖ్యానించడం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం చూశాం. 
  • ప్రజలను గందరగోళానికి గురి చేయడం, మూడు రాజధానుల పేరిట నిర్ణయాలు తీసుకోవడం ప్రజాపాలన అసంబద్దంగా కొనసాగడమే కాక, దేశం మొత్తం మనం తీసుకునే అనాలోచిత నిర్ణయాలని అపహాస్యంగా చూస్తున్నాయి. 
  • ఒక అనాలోచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి కొన్ని లక్షల భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడటం చూశాం. అలాగే వారికి ఇప్పటికీ సరైన న్యాయం చేయలేకపోవడం, ఇసుక కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూస్తున్నాం. 
  • 25 లక్షల ఇళ్ల పట్టాలు అని చెప్పి ఇస్తున్న భూములు న్యాయబద్ధంగా ఇవ్వలేదన్నదని చూస్తున్నాం. ప్రభుత్వ భూములను, దేవాదాయ, యూనివర్సీటీల భూములు, ప్రజలకు ఉండటానికి వీలు కానీ భూములను ఇవ్వడం చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసిందని స్పష్టంగా కనిపిస్తోంది. గత ఆగష్టులో కొంత మంది మెడికల్ స్టాఫ్ ను తీసుకొని తర్వాత డిసెంబర్ లో తొలగించారు. ఇలా వారికి ఇష్టం వచ్చినట్టు చేయడం వలన మెడికల్ సిబ్బంది కూడా అసహనానికి గురవుతున్నారు. 
  • కోవిడ్ 19 ప్రారంభ దశలో ప్రజలలో నిర్లిప్త ధోరణి ప్రభుత్వం కల్పించడం, పారాసిటమల్, బ్లీచింగ్ పౌడర్ వాడితే వెళ్తుంది అనే భావన ప్రజల్లో కల్పించి కొంత మేర నిరవగాహన కల్పించారు. కోవిడ్ 19, 2 వేవ్ వస్తుందని తెలిసినా అందుకు తగ్గ ప్రణాళికలు లేకుండా అజాగ్రత్తగా ఉండటం వల్ల మన రాష్ట్రం మరింత ఎక్కువగా కోవిడ్ బారిన పడింది. కోవిడ్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. 
  •  పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి గుండె లాంటిది. అలాంటి ప్రాజెక్ట్ ను నత్తనడకన సాగించడం దౌర్భాగ్యం. కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత అజాగ్రత్తగా ఎందుకు వ్యహరిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 
  • ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ప్రజల్లో కొంత భయోందోళన కలిగించారు. చివరికి సుప్రీం కోర్టు వరకూ ఈ సమస్య వెళ్ళి, రాష్ట్ర ప్రభుత్వం మొట్టికాయలు తినడం చూశాం. 
  • ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వ కార్యాలయాలకు వారి పార్టీ రంగులు వేయడం వల్ల వేల కోట్లు ప్రజాధనం వృధా అయింది. 
  • సంక్షేమ పథకాలు అనేవి రాజ్యాంగంలో కల్పించిన ఆదేశిక సూత్రాలు. అవి ప్రజల హక్కు. రాజ్యాంగంలో ఆర్టికల్ 38, 39, 41, 46 ద్వారా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ అందాల్సిన పథకాలు. ఇవి ప్రభుత్వాలు అందించే భిక్ష కాదు. రాజ్యాంగం ద్వారా వచ్చే మన హక్కు.  
  • సంక్షేమ పథకాలు అనేవి రాజ్యాంగ బద్దంగా ప్రజలకు కల్పించిన హక్కు. కానీ ఈ ప్రభుత్వాలు తామే సొంతంగా కనిపెట్టి ఇస్తున్నట్టు ప్రచార ఆర్భాటాలు చేయడం చూస్తున్నాం. 
  •  రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొన్ని పథకాలు నేరుగా లబ్ధిదారులకే డబ్బులు ఇవ్వడం వలన ఇతర రంగాలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, ఆర్థిక రంగం కుదేలయింది. ఇక్కడా విధానపరమైన లోపాలు చాలా ఉన్నాయి. 
  • సంక్షేమాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముడిపెట్టి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇదే వాలంటీర్ వ్యవస్థ గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కొమ్ము కాసే విధంగా పని చేయడం చూశాం. 
  • యస్ సి, యస్టీ కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించి ఆయా కులాల వారికి అభివృద్ధి సంక్షేమం లేకుండా తమ రాజకీయ ఓటు బ్యాంక్ కోసం వాడుకున్నారు. గతంలో ఉన్నత విద్య, ఆయా కులాల వారికి రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించేవారు. కానీ, ఇపుడు అలాంటి సంక్షేమ పథకాలు కనిపించడం లేదు. 
  • అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం అన్నారు. చివరికి రాష్ట్రం ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీదే ఆధారపడటం చూస్తే రాష్ట్ర పరిస్థితి మనుగడ ఏంటో అర్థం అవుతోంది. 
See also  నర్సులని గౌరవించిన జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర