ఇల్లెమో దూరం అసలే చీకటి గాఢాంధకారం , చేతిలో దీపం లేదు కానీ గుండెలు నిండా దైర్యం ఉంది అంటూ తాను గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉందని చేగువేరా ఆదర్శంగా సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు, దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలు చూసి విసుగెత్తి మండే గుండెల పోరాట స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని యువతలో, సమాజంలో మార్పే సంకల్పంగా మొదలయింది ఒక మహా యజ్ఞం “జనసేన” పార్టీ .
25సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆలోచనల సమాహారంతో , సిద్ధాంతాలతో రాజకీయం చేయడం కోసం ఉద్భవించింది. ఊహల జగతిలో విహరించే యువతను జాగృతం చేసి వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై, లోపాలను ప్రశ్నించే దిశగా ఒక జ్వాల యువత గుండెల్లో ప్రజ్వరిల్లేలా చేసింది .
మనుషుల్ని విభజించే ఇనుప తెరల్ని త్రుంచి వేసి ,దళిత జీవుల మొరల్ని అధికార పీఠాలకు వినిపించేలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తరగని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ, నిరుపేదల ఆశా కిరణం లా ,సమస్య అనగానే గుర్తొచ్చే వేదికగా నిలిచింది.
సముద్రం ఒకరి కాలి కింద కూర్చోదు ,పర్వతం ఒకడికి వంగి సలాం చేయదు అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్లు 9 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడి రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ , ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తే వాటి మార్గాలను కూడా కనుగొనలేము.
ఓటు అనే బోటు మీద పయనిస్తున్న ప్రజాస్వామ్యం నోటు అనే తుఫాను ధాటికి సంద్రంలో మునిగిపోతున్న నేటి రాజకీయ వ్యవస్థలో నిస్వార్థ రాజకీయం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయాల్లో సామాన్యుడి భాగస్వామ్యం అని నిరూపించి సిద్ధాంత ఆయుధాలుగా అవినీతి రాజకీయ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేస్తోంది.
కన్నీటితో ఇరుక్కున్న మానవ సమాజాల మధ్య కులాలను కలిపే ఆలోచనా విధానంతో వెయ్యి జ్యోతుల్ని భుజం తడుతూ కదిలించిన గాలి కెరటంలా రెపరెపలాడుతున్న జాతీయ జెండా స్ఫూర్తితో జాతీయ వాద భావనలను అణువణువున నింపుకుంటూ వేల గొంతుకలతో కలిసి చిరు ఆశాదీపమై నిండు కలల జగత్తును మేల్కొల్పుతుంది…
అవినీతి తిమింగలాల విహారం చేస్తున్న సముద్రమనే నా దేశంలో జీవితమనే విశాల జైలులో బెడీలతో బంధించి ఉన్న హస్తాన్ని తెంచుకొని తరతరాలుగా బానిసత్వ సంకెళ్ళతో బందీగా ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను , సామాజిక పరిస్థితులను విముక్తి చేయడానికి నలుదిక్కులా ముసిరి విసిరే నవ యువ పవనాలతో పోరాడుతోంది గొంతెత్తి కేకలు వేస్తూ భావితరాల భవిష్యత్తు కోసం పూల బాట.
దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకుల మధ్య తనకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుని ,ప్రత్యర్థుల కుట్రలు , కుతంత్రాలతో వారు చేస్తున్న రాజకీయాలను ఎదుర్కుంటూ,కొంత మందికి కొమ్ము కాస్తున్న మీడియా వ్యవస్థను ఎదురించి తన జనసైనికులే మీడియా గా మారి జనసేవ ధ్యేయంగా , ప్రజా క్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతు జనసేన ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం దక్కించుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తు పోరాడుతుంది ..పోరాడుతూనే ఉంటుంది …
One Response
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ…………… గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
– పుస్తకం.నెట్
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
———–
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com