ఇల్లెమో దూరం అసలే చీకటి గాఢాంధకారం , చేతిలో దీపం లేదు కానీ గుండెలు నిండా దైర్యం ఉంది అంటూ తాను గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉందని చేగువేరా ఆదర్శంగా సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు, దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలు చూసి విసుగెత్తి మండే గుండెల పోరాట స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని యువతలో, సమాజంలో మార్పే సంకల్పంగా మొదలయింది ఒక మహా యజ్ఞం "జనసేన" పార్టీ .
25సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆలోచనల సమాహారంతో , సిద్ధాంతాలతో రాజకీయం చేయడం కోసం ఉద్భవించింది. ఊహల జగతిలో విహరించే యువతను జాగృతం చేసి వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై, లోపాలను ప్రశ్నించే దిశగా ఒక జ్వాల యువత గుండెల్లో ప్రజ్వరిల్లేలా చేసింది .
మనుషుల్ని విభజించే ఇనుప తెరల్ని త్రుంచి వేసి ,దళిత జీవుల మొరల్ని అధికార పీఠాలకు వినిపించేలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తరగని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ, నిరుపేదల ఆశా కిరణం లా ,సమస్య అనగానే గుర్తొచ్చే వేదికగా నిలిచింది.
సముద్రం ఒకరి కాలి కింద కూర్చోదు ,పర్వతం ఒకడికి వంగి సలాం చేయదు అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్లు 9 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడి రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ , ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తే వాటి మార్గాలను కూడా కనుగొనలేము.
ఓటు అనే బోటు మీద పయనిస్తున్న ప్రజాస్వామ్యం నోటు అనే తుఫాను ధాటికి సంద్రంలో మునిగిపోతున్న నేటి రాజకీయ వ్యవస్థలో నిస్వార్థ రాజకీయం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయాల్లో సామాన్యుడి భాగస్వామ్యం అని నిరూపించి సిద్ధాంత ఆయుధాలుగా అవినీతి రాజకీయ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేస్తోంది.
కన్నీటితో ఇరుక్కున్న మానవ సమాజాల మధ్య కులాలను కలిపే ఆలోచనా విధానంతో వెయ్యి జ్యోతుల్ని భుజం తడుతూ కదిలించిన గాలి కెరటంలా రెపరెపలాడుతున్న జాతీయ జెండా స్ఫూర్తితో జాతీయ వాద భావనలను అణువణువున నింపుకుంటూ వేల గొంతుకలతో కలిసి చిరు ఆశాదీపమై నిండు కలల జగత్తును మేల్కొల్పుతుంది...
అవినీతి తిమింగలాల విహారం చేస్తున్న సముద్రమనే నా దేశంలో జీవితమనే విశాల జైలులో బెడీలతో బంధించి ఉన్న హస్తాన్ని తెంచుకొని తరతరాలుగా బానిసత్వ సంకెళ్ళతో బందీగా ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను , సామాజిక పరిస్థితులను విముక్తి చేయడానికి నలుదిక్కులా ముసిరి విసిరే నవ యువ పవనాలతో పోరాడుతోంది గొంతెత్తి కేకలు వేస్తూ భావితరాల భవిష్యత్తు కోసం పూల బాట.
దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకుల మధ్య తనకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుని ,ప్రత్యర్థుల కుట్రలు , కుతంత్రాలతో వారు చేస్తున్న రాజకీయాలను ఎదుర్కుంటూ,కొంత మందికి కొమ్ము కాస్తున్న మీడియా వ్యవస్థను ఎదురించి తన జనసైనికులే మీడియా గా మారి జనసేవ ధ్యేయంగా , ప్రజా క్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతు జనసేన ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం దక్కించుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తు పోరాడుతుంది ..పోరాడుతూనే ఉంటుంది ...
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com