Search
Close this search box.
Search
Close this search box.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ దూషణల పర్వం

ఆంధ్రప్రదేశ్

          ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పనిసరి, అదీ అధికారం చేపట్టిన ప్రభుత్వ పనితీరుని సదా పరిశీలిస్తూ తప్పు ఒప్పులపై ప్రతి పక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు విమర్శించడం మాములు విషయం. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు స్పందించి జవాబు ఇవ్వటం మామూలే. ఒకప్పుడు రాజకీయాలు అంటే హుందాగా, గౌరవంగా ఉండేవి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా పాలసీల గురించి, ప్రభుత్వ విధి విధానాలను గురించే ఉండటం సర్వ సాధారణం. కానీ కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న హుందాతనం గౌరవం తగ్గిపోయాయి విమర్శలకు ప్రతి విమర్శలు విధాన పరమైనవి కాకుండా దారి తప్పి, నీతి తప్పి వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయటం ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న మీడియాను అనుకూలంగా మార్చుకొని తప్పుడు ప్రచారాలు చేయటం అలవాటై పోయింది కొన్ని రాజకీయ పార్టీలకు. అది కాస్తా ఈ దశాబ్ద కాలం లో విపరీత ధోరణికి పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగి మీడియా, వెబ్సైట్లు, యూ ట్యూబ్ చానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. డబ్బు కోసం దిగజరిపోయి తప్పుడు ప్రచారాలు చేయటం ఒక ఆనవాయితీగా మార్చుకున్నాయి. అసలు ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఎవరినో పెంచి పోషించడం ఎందుకు ? ప్రభుత్వ పనితీరు సక్రమంగా ఉంటే వీటి అవసరం ఏముంది? చేసిన పనిని, తీసుకున్న నిర్ణయాలు ప్రజా సంక్షేమం కొరకు అయినప్పుడు ఎవరినో ఆసరా తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది ? అధికారం వేరే వ్యక్తుల చేతికి వెళ్లకూడదు, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దొడ్డిదారి విధానాలను పెంచిపోషించారు కొందరు. వాటిని తారా స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఈ ప్రభుత్వానిదే.

           ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వానికి, రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తులు బైటికి వస్తుంటారు డైవెర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా సాగుతోంది. చట్ట సభల్లో మాట్లాడే భాష కావొచ్చు, చేస్తున్న విమర్శలు కావొచ్చు రాజకీయాలంటే సామాన్యుడు జూగుప్సాకరంగా చూసే విధంగా మార్చేశారు. దూషణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా చీమకుట్టినట్లు ఉండదు, నిమ్మకు నీరెత్తినట్లు అయినా ఉండదు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏ సభలోనూ ప్రతి పక్షాల గురించి, వ్యక్తిగత విషయాలు ప్రస్తావన లేకుండా మాట్లాడనప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడే వారిని కుల సమీకరణాలు చూసుకుని మరీ మీడియా ముందుకు పంపిస్తూ ఉండటం అలవాటయిపోయింది. అనుకూల మీడియా చేతిలో ఉండటం ఒక వెసులుబాటు అయితే అక్రమార్జనతో సంపాదించిన సొమ్మును అలవోకగా వందల కోట్లు ఖర్చు చేసి ప్రతి పక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు కధనాలు ప్రచురించేలా చేయటం, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయటం అనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు.
           ప్రజా సమస్యలు గాలికి వదిలి పనికిరాని విషయాలను చర్చిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఇబ్బడిముబ్బడిగా వాగ్దానాలు ఇవ్వటం నామ్ కే వాస్తే కొన్ని పధకాల పేరిట బటన్ నొక్కి డబ్బులు వేస్తే పాలన అనుకొని మురిసిపోతున్నారు. ఎవరు ప్రభుత్వ విధానాలను విమర్శించినా కింద స్థాయి వ్యక్తులు అయితే దాడులు చేయటం, పెద్ద స్థాయి నాయకులైతే వ్యక్తిగత విమర్శల ద్వారా విషయాన్ని పక్క దారి పట్టించడం. ప్రజాస్వామ్యంలో ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే హక్కుగా ఏర్పడిన రాజకీయ పార్టీ జనసేన ఎప్పుడూ గత, ప్రస్తుత ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంది. అప్పుడూ ఇప్పుడూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై పైగా మహిళలను వివాదాల్లోకి లాగటం, విమర్శలు చేయడం తప్ప విధి విధానాలపై స్పందించి జవాబు ఇచ్చిన ప్రభుత్వం లేదు. ప్రభుత్వ పాలసీల గురించి, అవినీతి, అక్రమాల గురించి, జరగాల్సిన అభివృద్ధి గురించి, జరుగుతున్న అరాచకాలు గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తుంటే ఎప్పుడో ఆయన జీవితంలో జరిగిన పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి మాట్లాడతారు. అసలు వ్యక్తిగత జీవితానికి వ్యవస్థకు పోలిక ఏంటి ? వివాహ జీవితం విచ్ఛిన్నం అయితే ఇద్దరు వ్యక్తుల సమస్య దానికి రాష్ట్ర భవిష్యత్తు కి రాష్ట్ర అభివృద్ధికి, జరిగే అవినీతి అక్రమాలకు పోలిక ఏంటి ? ప్రభుత్వం సక్రమంగా పని చేస్తుంటే ఒక్కరైనా జవాబు చెప్పే ధైర్యం చేయట్లేదు అంటే అదే అతి పెద్ద ఓటమి. ఎన్నికల్లో గెలిచాం అధికారం చేపట్టాం మాకు తిరుగులేదు అనుకొనే స్థాయి మారాలి. నైతికత లేని రాజకీయంలో మార్పు రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారు చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం రాబోతుంది
images (3)
మార్పు కోసం జనసేన
Volunteer
వాలంటీర్ల వ్యవస్థ - జనసేన గళం
వారాహి
దిగ్విజయంగా తొలి విడత వారాహి విజయయాత్ర

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way