నూజివీడు, (జనస్వరం): కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గములో ముసునూరు మండల రమణక్కపేట గ్రామంలో ప్రధాన రహదారికి ఇరు వైపులా డ్రైనేజీ లేక ఇళ్లలోకి నీరు, వర్షపు నీరు రోడ్డు మీదకి చేరడంతో గుంతలు పడి గ్రామస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాటికి వెంటనే నిర్మాణ పనులు, అలాగే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా త్వరగా చేపట్టాలని కోరుతూ గ్రామ పంచాయీతీ సెక్రటరీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు పాశం నాగబాబు, నామాల రాంబాబు, వేట త్రినాద్, చేకూరి అనిల్, సూర్య, గుండాల శివ,కేశవ తదితురులు పాల్గొన్నారు.