వైసీపీపార్టీ వర్గాల దాడిలో గాయపడిన దళితులను పరామర్శించిన ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు

వైసీపీపార్టీ

                  శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం సుంకరపేటలో ఇటీవల వైసిపి వర్గాల దాడిలో గాయపడిన దళితులను పరామర్శించి ధైర్యం తెలిపిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు. దళితుల మీద అధికార ప్రభుత్వం చేస్తున్న దాడులను ఖండిస్తూ, పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  లేని పక్షంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావుతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  బొడ్డవలస గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు పార్టీలోకి చేరికలు