Search
Close this search box.
Search
Close this search box.

ప్రభుత్వ ఆస్తులను తాకాలంటే భయపడే చట్టం రావాలి : జనసేన నాయకులు యుగంధర్ పొన్నాల

యుగంధర్ పొన్నాల

     చిత్తూరు, (జనస్వరం) :  జనసేన పార్టీ నాయకులు యుగంధర్ పొన్నాల గారు వెదురు కుప్పం మండలం తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పచ్చికాపల్లం పంచాయతీ, పచ్చికాపల్లం డంపింగ్ యార్డు ప్రక్కన ఎర్ర బంగారాన్ని రెండు జెసిబిలు, కొన్ని టిప్పర్ లలో సరఫరా చేసి, గతవారంలో ఒక కోటి రూపాయలు ఆదాయం పొందిన వారు, ఎంతటి వారైనా, ఏ అధికారి అయినా వారి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికైనా మట్టి అవసరమైన, మరి ఇంకేదీ ఆవశ్యకత అయినా సచివాలయం గాని లేదా మండల తహసీల్దార్ ద్వారా అనుమతి తీసుకొని లాయల్ గా, లీగల్గా పంచాయతీకి ఆదాయం చేకూరే విధంగా చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రకృతి సంపదను దోచుకునేవారు దేశద్రోహులుగా మిగిలి పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి సంపద, ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదని తెలిపారు. అక్రమార్కులను విజ్రామార్కులుగా చేయకండని తెలియజేసారు. ప్రభుత్వ ఆస్తులంటే భయపడే చట్టం రావాలని తెలియజేశారు. జేసీబీలు, టిప్పర్ల మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. నేటి రాజకీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ వ్యవస్థను అవలంబించాలని కోరారు. జనసేన పార్టీ ఉన్నది సేవకే గాని సంపాదనకు కాదని తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలారు వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు కిషోర్ రెడ్డి, మధు, ప్రధాన కార్యదర్శి సతీష్, నియోజకవర్గం సమన్వయ కర్త రాఘవ, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way