వినాయక చవితి సందర్బంగా, నేడు చీడికాడలో గల మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలందరికి శుభం కలగాలని వినాయకుని పూజా కార్యక్రమం నిర్వహించామని జనసేన నాయకులు తెలిపారు. ఆ సందర్భంగా బోయిదాపు కిరణ్ గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో కరోనా మహమ్మారీ లాంటి విఘ్నాలన్ని తొలగి నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ వినాయకుని వేడుకున్నాం అని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి మహమ్మారుల నుంచి ప్రజలందరినీ ఆ ఓంకార స్వరూపుడు కాపాడాలని, అందరికీ ఆరోగ్యంతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని.. సత్పరిపాలన అందించవలసిన ప్రభుత్వాధినేతలు కక్షపూరిత, వ్యర్థ పాలన వైపు పోకుండా సద్బుద్ధి ప్రసాదించాలని ఆ గణనాధుని మా మాడుగుల జనసేన పార్టీ తరపున ప్రార్ధిస్తున్నాము అని తెలిపారు. తదుపరి జనస్వరం న్యూస్ వారు అందించిన “2019 ఎన్నికల తరువాత జనంలోకి జనసేన ప్రస్థానం” పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తకం ద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు మరియు 2019 ఎన్నికల ఘోర పరాభావం తరువాత ప్రధాన ప్రతిపక్ష పోషించే స్థాయిలో పార్టీ ఎదిగిన తీరుని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశామని.. ఈ పుస్తకాన్ని ప్రజలలోకి తీసుకోని వెళ్లాలని జనసైనికులను కోరారు. ఈ కార్యక్రమంలో బైలపూడి ఉప సర్పంచ్ శ్రీ గుమ్మడి సంతోష్ గారు, జివి.మూర్తి, గుమ్మడి శ్రీరామ్, నాయుడు, నవీన్, శ్రీనాదు విజయ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.