కరోనాతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన నల్లజర్ల మండల జనసేన నాయకులు

నల్లజర్ల

   నల్లజర్ల, (జనస్వరం) :  పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలము తెలికిచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి  కరోనాతో మృతి చెందడం వలన ఆ కుటుంబము ఇంటి పెద్దని కోల్పోవడం జరిగింది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినము సందర్భంగా  వారి  కుటుంబానికి, వారి పిల్లల విద్య కోసం జనసేన పార్టీ తరపున  25,000 వేల  రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అక్కడ జనసేన పార్టీ ఉంటుందని, ప్రజలకు సహాయము చేసే గుణము, మా అధినాయకుడుని చూసి నేర్చుకున్నామనీ, మా అధినేత అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం ప్రజా సేవలో ఉంటామని, ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమములో మండల జనసేన నాయకులు, తెలికిచర్ల గ్రామ జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.  

See also  "వారాహి యాత్ర" ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ