గ్రామ సమస్యలపై EORD శివరామయ్య గారికి వినతి పత్రం అందచేసిన బనగానపల్లె జనసేన నాయకులు

బనగానపల్లె

       బనగానపల్లె,  (జనస్వరం)  :  బనగానపల్లె గ్రామ పంచాయతీలోని పలు సమస్యలపై EORD శివరామయ్య గారికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలోని చాలా చోట్ల కాలువల నిర్వహణ సరిగ్గా లేదని వర్షాల వల్ల నీరు నిల్వ ఉండటం వలన పలు రోగాలకు కారణం అవుతుంది అని, వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని డెంగ్యూ, మలేరియా లాంటి రోగాల బారిన పడకుండా పట్టణంలో చాలా చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లెలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు శివరామిరెడ్డి, కాశీం, అజిత్, జనార్ధన్, బాబా ఫక్రుద్దీన్, సింహాద్రి మరియు తదితురులు పాల్గొన్నారు.

See also  వరదల వల్ల పంటలు ముంపుకు గురైన రైతుల్ని కలిసిన జనసేన వీర మహిళ కృష్ణవేణి సుంకర