రాజంపేట, (జనస్వరం) : జనసేన కువైట్ వారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 30 రోజుల ముందే 30 ప్రాంతాల్లో 30 సేవ కార్యక్రమాలలో భాగంగా రాజంపేటలో మొదటి సేవా కార్యక్రమం ప్రారంభించారు. నందలూరు మండలంకి సంబంధించిన దివ్యాంగుల జాతీయ క్రికెట్ క్రీడా కారుడు శివకోటి గారికి జనసేన కువైట్ వారి సహకారంతో నందలూరు జన సైనికుల ఆధ్వర్యంలో 15000 రూపాయలు ఆర్ధిక ప్రొత్సహం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజంపేట పార్లమెంటరీ ఇంఛార్జ్ ముఖరం చాంద్ గారి చేతుల మీదగా శివ కోటికి గారికి అందించారు. అలాగే కేక్ కటింగ్ చేసి ముందస్తు జన్మదిన వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.