తాడేపల్లి గూడెం ( జనస్వరం ) : టీం సైనిక లీడర్ అమీర్ ఖాన్ (రియాద్ జనసేన NRI టీమ్, సౌదీ అరేబియా), మారిసెట్టి అజయ్ బాబు ( మారిసెట్టి అజయ్ బాబు యువసేన) ల సంయుక్త ఆధ్యర్యంలో క్యాన్సర్ పేషంట్ జోగీందర్ గారికి చికిత్స నిమిత్తం రూ. 83,000/- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదగా టీమ్ సైనిక INDO -NRIS ఆర్గనైజేషన్ లోగో లాంచ్ సందర్భంగా ఇవ్వడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో ఒక జనసైనికుడికి అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని ఎన్ఆర్ఐ టీమ్ సౌదీ అరేబియా జనసైనికులు అండగా నిలబడి ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం డబ్బు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని అన్నారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తాడేపల్లిగూడెం, ధన రెసిడెన్సీలో జరిపిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.