రాజంపేట జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి 35,000 రూపాయలు ఆర్థిక సహాయం

రాజంపేట జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి 35,000 రూపాయలు ఆర్థిక సహాయం

      కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం రాంనగర్ లో నివసించే ఒక దళిత వర్గానికి చెందిన తల్లి తండ్రి చనిపోయి అత్త మామల సంరక్షణలో నివసించే ఒక అమ్మాయి రేషన్ కార్డ్లో భర్త చనిపోయిన నానమ్మకు ప్రభుత్వ పెన్షన్ వస్తున్న కారణంగా ఫీజ్ రీయింబర్స్ మెంట్ నిరాకరించి దరఖాస్తును చెల్లదని చెప్పారు. కడప అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి ఆర్థిక స్తోమత లేక అర్హత ఉన్నా రేషన్ కార్డు లోని పొరపాటు వల్ల ఫీజ్ కట్టలేక పోయి చదువు ఆపేయ్యాల్సిన  పరిస్థితిలో  రాజంపేట జనసేన పార్టీ తరపున ఒక విద్యా సం. కు ఫీజ్ 35,000/- రూపాయలు రామ్ నగర్ లో నివసించే వారి కుటుంబ సభ్యులకు చెక్ రూపంలో అందచేయటం జరిగింది.. అంతే కాకుండా ఫీజ్ రీయింబర్స్ మెంట్ తిరిగి రావడానికి రేషన్ కార్డులో పేరు మార్పు చేయించి కొత్త రేషన్ రావటానికి కూడా జనసైనికులు కృషి చేసి ఈ ప్రక్రియలో కలిగిన అనేక సమస్యల గురించి రాజంపేట జనసేన నాయకులు ప్రభుత్వానికి తెలియ చేశారు.

See also  అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధం, నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు పి. జయరాం