భద్రాద్రి జిల్లాలో ఎంసెట్ మోడల్ పరీక్ష

– విద్యార్థులకు సువర్ణావకాశం
– సారపాక బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మోడల్ పరీక్ష రాబోతోంది

సారపాక, మార్చి 20 (జనస్వరం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంసెట్ (EAPCET) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి మోడల్ పరీక్ష నిర్వహించనున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన EAPCET పరీక్షను రాయబోయే విద్యార్థుల కోసం ఈ మోడల్ పరీక్ష 22-03-2026, ఆదివారం ఉదయం 9:00 గంటలకు, బ్రిలియంట్ జూనియర్ కాలేజ్, సారపాక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. విద్యాసంస్థల చైర్మన్ డా. బి.ఎన్.ఆర్ ప్రకారం, ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు ఎంసెట్ విధానం, ప్రశ్నల సరళి, సమయ నిర్వహణపై అవగాహన పొందగలుగుతారు. అలాగే, మోడల్ పరీక్షలో మొదటి రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ కూడా అందించనున్నారు. మోడల్ పరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఒక రోజు ముందుగా తమ పేర్లను బ్రిలియంట్ జూనియర్ కాలేజ్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చైర్మన్ తెలిపారు.

See also  జిల్లా పేరు మార్పుతో కోనసీమలో పెట్టిన చిచ్చు చాలు : చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత