అమ్మూ బమ్మిడికి ఎస్పీ సత్కారం

శ్రీకాకుళం, డిసెంబర్ 15 : ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, మహిళా పోలీస్ ఎస్. అమ్మూ బమ్మిడికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “అభ్యుదయం” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు తదితరుల చేతుల మీదుగా సోమవారం ప్రత్యేక జ్ఞాపికను ఆమె అందుకున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “అభ్యుదయం – సైకిల్ యాత్ర” సోమవారం శ్రీకాకుళం జిల్లా జె.ఆర్.పురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన “సంకల్పం” వేదిక మీద వ్యాఖ్యాతగా అమ్మూ బమ్మిడి తనదైన శైలిలో ప్రత్యేకంగా వ్యవహరించారు. జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె.వి. మహేశ్వర్ రెడ్డి, డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానంద, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, జేసీ ఫర్మాన్ ఖాన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం ప్రత్యేకంగా అభినందించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా సభను రంజింపజేయడంతో పాటు, ప్రజలను చైతన్యం చేయడం పట్ల ప్రత్యేకంగా ఆమెను సత్కరించారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు (జి.ఎం.ఎస్.కె.) సోమవారం ఉదయం రామతీర్థాల జంక్షన్, రణస్థలం వద్దకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం పట్టణంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద “అభ్యుదయం – సైకిల్ యాత్ర” బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కాగా, అమ్ము బమ్మిడిని శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద, జెఆర్ పురం సిఐ అవతారం, ఎస్ఐ చిరంజీవి తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

See also  భోగాపురంను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి