విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రుల పాత్ర కీలకం : చిన్నా జనసేన

మర్రిపాడు, అక్టోబర్ 05, (జనస్వరం) : మర్రిపాడు మండల కేంద్ర జెడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ – మెగా 3.0 కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చిన్నా జనసేన పాల్గొన్నారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం విద్యార్థుల విద్యా ప్రయాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర ప్రగతి సాధనలో తల్లిదండ్రుల నిష్కర్ష అనివార్యమని అన్నారు. ఉపాధ్యాయులతో కలిసి పనిచేసి విద్యార్థుల బలహీనతలను గుర్తిస్తే పాఠశాల ర్యాంకులు గణనీయంగా మెరుగుపడతాయని వివరించారు. మెగా మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై మరింత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

See also  కూచిపూడి కళాకేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా రంగ ప్రవేశం