రాజకీయ పార్టీని ఒక గ్రామంలో ఆసుపత్రితో పోల్చుదాం. ఆ ఊరిలో ఉన్న ప్రజలు అందరూ తమకు ఎంత అవకాశం ఉంటే అంత పోగుచేసుకుని ఒక హాస్పిటల్ కట్టుకున్నారు. ప్రజలు ఒక నిజాయితీపరుడు అయిన యువకుడుని ఎంపిక చేసి వైద్యుడిగా చదివించారు. ఇంకో గ్రామంలో పెద్ద వ్యాపారస్తుడు పెద్ద హాస్పిటల్ కట్టాడు. ఎవరో కమర్షియల్ డాక్టర్ ని పట్టుకొచ్చి ఆ హాస్పటల్లో పెట్టారు. మొదటి ఆసుపత్రి చేసే సేవకు రెండో ఆసుపత్రి చేసే సేవకు వ్యత్యాసమే జనసేన చేసే సేవ. మొదటి ఆసుపత్రి జనసేన. రెండోది మన ముందు ఉన్న ఇతర పార్టీలు. మొదటి ఆసుపత్రిలో పేదవాడికి చక్కటి వైద్యం వ్యాపార దృక్పధం లేకుండా నిజాయితీగా అందుతాది. రెండో ఆసుపత్రి ప్రజలను పిప్పి చేసి చంపేస్తుంది.
రాజకీయ పార్టీలు చేస్తున్న అక్రమాలు అంటే అందరికీ కోపమే. కానీ అన్నీ వదిలేసి మన కోసం పోరాటానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటివారికి మనం ఏ విధంగాను మద్దతు తెలపం. నీ పాట్లు నువ్వు పడు… మాకు మాత్రం నిజాయితీపరుడు గెలవాలి అని మనం ఇంట్లో పడుకుని కోరుకుంటే జరుగుతుందా ? మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి. పవన్ కళ్యాణ్ పార్టీ నడిపేది ఆయన కోసం కాదు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఒక వేదిక ఇచ్చాడు. దానిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. రాజకీయ అవినీతి మనం ఆపలేకపోతున్నాం అనుకుంటూ మదనపడే బదులు మనం కనీసంగా ఏమి చెయ్యగలము అని నిజాయితీగా ఆలోచిద్దాం. అండగా నిలబడదాం. నిజాయితీగా పార్టీ నడపాలి అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయం. పార్టీ కార్యాలయం నడపాలి, పార్టీలో వివిధ వ్యవస్థలు నడపాలి. వివిధ అంశాలు రీసెర్చ్ కోసం ఖర్చు పెట్టాలి. పర్యటనలు, సభలకు ఖర్చులు పెట్టాలి. దీనికి అయ్యే ఖర్చులు పవన్ కళ్యాణ్ ఎక్కడ సమకూర్చుకోగలుగుతాడు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? 2008లో పిల్లల కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించిన వ్యక్తిత్వం ఆయనది. 2020లో పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఇంకో ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసారు. ఇటువంటి త్యాగలు చేసిన ఆ కుటుంబాన్ని ఈశ్వరుడు చల్లగా చూడాలి. ఆయన ఓపిక ఆరోగ్యం మనకు తెలియని అంశాలు. కానీ ఒళ్ళు హూనం చేసుకుని సినిమాలు చేసి ఆ డబ్బు మొత్తం జనసేనకు పెడుతున్న నిబద్ద ఉద్యమ శిఖరం పవన్ కళ్యాణ్. స్వార్ధపరుల ఆశకు అవినీతికి ప్రజారాజ్యం బలైపోయిన దరిమిలా కేవలం ఆశయమే పునాదిగా పుట్టిన పార్టీ జనసేన. అటువంటి పార్టీకి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు అండగా నిలవాల్సిన సమయం. దానికోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
సిద్ధాంతాలు తాకట్టు పెడితే బహుళ జాతుల సంస్థలనుండి కొన్ని వందల కోట్లు ఆయన కాళ్ళ దగ్గర ఉంటాయి. ఆయన మనలాంటివారి దగ్గరనుండి నీతివంతమైన విరాళాలు మాత్రమే అంగీకరిస్తున్నారు. కాష్ రూపంలో డొనేషన్స్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్పిన అనేక సందర్భాలు మనం విన్నాం. అవినీతిపరుల సొమ్ము అయితే చెక్కు అయినా జనసేనకు వద్దు అని చెప్పడం విన్నాం. వారు సామాజిక లబ్ది కాకుండా వ్యక్తిగత లబ్ది ఆశిస్తారు. అది అంగీకరించినట్లు అయితే పాలనలో సామాన్య ప్రజల ఇంట్రస్ట్ విషయంలో కంప్రమైస్ అవ్వాల్సి వస్తుంది అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు.
రాజకీయ పార్టీలు నిజాయితీగా రాజకీయం చెయ్యాలి అంటే నిజాయితీ అయిన డబ్బులు కావాలి. అవినీతిపరులు అయిన బడా పారిశ్రామికవేత్తలు జనసేనకు ఇవ్వరు. ఈయన తీసుకోరు. జగన్ లాంటివాళ్లకు ఇస్తారు, వాడు దండుకుంటాడు. ఎందుకంటే అధికారం వచ్చాక ఇద్దరూ కలిసి దాని మీద పది రేట్లు దండుకోవచ్చు అనే ఉద్దేశం. జనసేన సిద్ధాంతాలు ప్రజలకు అనుకూలం. ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్నప్పుడు మాత్రమే బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలం. ఒక పోర్ట్ వారికి కేటాయించాలి అంటే దానిద్వారా రాష్ట్రానికి ఏమి లాభం, అక్కడ ప్రజలకు ఏమి లాభం అని జనసేన పార్టీ ఆలోచిస్తుంది. వారి దగ్గర అక్రమ డొనేషన్లు తీసుకున్న పార్టీలు ప్రజలు రాష్ట్రానికి సంబంధం లేకుండా ధారాదత్తం చేయాల్సి వస్తుంది. వైజాగ్ గంగవరం పోర్టు విషయంలో జగన్ అదాని మధ్య అదే జరిగింది. జగన్ లాంటివాళ్ళు చేసిన కొన్ని వందల అంశాల్లో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.(వైసీపీ వాళ్ళు ఛాలెంజ్ కి నిలబడితే ఆ వంద ఉదాహరణలు చెప్పడానికి ఈ teluguchegu సిద్ధం ).
ఒక అంచనా ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరిస్తున్న విరాళాల్లో 55% పైగా విరాళాలకు లెక్కలు లేవు. ఆ స్థాయిలో దుర్వినియోగం, అవినీతి ఉన్నాయి. ఈ లెక్కల్లో TRS, DMK, JDS, AIADMK, YSRCP పార్టీలు ఉన్నాయి. 100% అత్యంత పారదర్శకంగా లెక్కలు చూపిస్తున్న పార్టీ జనసేన మాత్రమే అని ఒక స్వచ్చంద సంస్థ తన సర్వేలో తెలిపింది. ఇది ప్రతి జనసైనికుడు గర్వపడాల్సిన విషయం. జనసేనకు ఇచ్చిన ప్రతి రూపాయి ఉపయోగపడుతుంది అనే ధైర్యంతో డొనేట్ చేయొచ్చు.
ఒక పోస్ట్ మాస్టర్ ప్రతి నెల 200, ఒక హెడ్ మాస్టర్ 2000 జమ అయ్యేలా పెట్టారు. ఒక గృహిణి తన ఖర్చులు తగ్గించుకుని ప్రతి నెలా జమ చేస్తున్నారు. వారి స్ఫూర్తితో ప్రతి నెలా ప్రతి మధ్య తరగతి కుటుంబం జనసేనకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది మన కోసం, మన రేపటి తరం కోసం. అభిమాని అని చెప్పి చప్పట్లుతో ఆపకుండా. సమాజ శ్రేయోభిలాషి అని చెప్పి సమాజానికి సుద్దులు చెప్పి ఆపకుండా ఈ ఉద్యమంలో మనం భాగస్వాములు అవుదాం.
https://donations.janasenaparty.org/ పేజీలో క్లియర్ గా గైడ్ చేస్తుంది. దానిలో recurring డిపాజిట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మీరు చేసి మరి కొంతమందితో చేయించి “నా సేన కోసం నా వంతు” ద్వారా సమాజానికి అండగా నిలబడదాం.
మీ
ట్విట్టర్ (X) : @Teluguchegu