రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం : రాజంపేట జనసేన నాయకులు

రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం : రాజంపేట జనసేన నాయకులు

              రైతులపట్ల ప్రభుత్వవైఖరి దారుణంగా మారిందని జనసేన నాయకులు ఎద్దల పవన్‌ బాబు, బీ రాజేష్‌లు అన్నారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులపై చేస్తున్న దాడులు, అక్రమ కేసులు ఎంతవరకు సమంజసమన్నారు. రైతుల చేతుళ్ళకు సంకెళ్ళువేని తీసుకువెళ్ళడం ఎక్కడ చట్టంలో ఉందన్నారు. రైతులు ఏ తప్పు చేశారని వారిపట్ల ఇంతకఠినంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. శాంతియుత వాతావరణంలో రాజధానికోసం ఉద్యమాలు చేస్తున్న రైతులు, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడటం, అక్రమ కేసులు‘బనాయించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వారిని భయబ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. గాజువాకలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధితుల కుటుంబాలకు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ప్రాంత మహిళల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉద్దండంవెంకటేష్‌, కే సుబ్బరాయుడు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

See also  రాష్ట్రమంతటా బాదుడే.. బాదుడు