విజయనగరం నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండల అధ్యక్షులు సమావేశం

విజయనగరం

      విజయనగరం ( జనస్వరం ) : ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండల అధ్యక్షులు సమావేశం  కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రస్తుత స్థానిక పరిస్థితులు చేస్తున్న కార్యక్రమాలు చేయబోతున్న కార్యక్రమాలు ప్రస్తావించడం జరిగింది. డేటా కలెక్షన్, మండల అధ్యక్షలను & జిల్లా కో ఆర్డినేటర్స్ ను సమన్వయ పరచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఇదివరకు ఎవరూ సాహసించలేదని అన్ని విధాలుగా తమ శక్తి యొక్క మేర సహకరించుకొని పార్టీ పురోగతికి తోడ్పడుతూ ఉంటామని అన్నారు. ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని ఇలాంటి మంచి ఆలోచనలకు తెరలేపి అన్ని విభాగాలను ఒక దగ్గర చేర్చి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజినల్ ఐటి కోఆర్డినేటర్ గేదల సతీష్, ఐటీ కోఆర్డినేటర్స్, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. 

See also  కర్నూల్ జిల్లా, గోనెగండ్లలో యునాని వైద్యులకు జనసేన నాయకులు ఘనసన్మానం