కార్యకర్తకి అండగా జనసేన పార్టీ

– ఐదు లక్షల రూపాయలు బీమా అందజేసిన జనసేన నాయకులు

      మైలవరం, (జనస్వరం) : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్త కీ”శే రెడ్డి రంగారావు కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు భీమా చెక్ ను జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ మోహన రావు (గాంధీ), జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, బొలియాశెట్టి శ్రీకాంత్, రావి సౌజన్య, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మలపాలెం జనసేన పార్టీ ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, గ్రామ అధ్యక్షుడు తిరుమల శెట్టి పవన్, చెల్లు చిన్నస్వామి నాగబాబు, చెరుకుమల్లి సురేష్, ఎర్రంశెట్టి నాని, శీలం బ్రహ్మయ్య, కోలా రాజు, ఎర్రబెల్లి నరసింహారావు, బుల్లా రాజు, జిల్లా, మండల, గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  సర్వేపల్లిలో కొనసాగుతున్న జనసేన పాదయాత్ర