ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పేదలకు అందని హౌస్ ఫర్ ఆల్ ఇల్లు : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

               నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు రూరల్ 18 డివిజన్ జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ హరనాధపురం జనసేన కార్యకర్త వర్షన్ కుటుంబ సభ్యులు మద్దతును తీసుకొని ఆ ప్రాంతం లో జనసేన పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది. సర్వేపల్లి కాలవ కట్ట పై అర్హులైన పేదలకు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదు, కొంతమందికి అసలు నమోదు కూడా జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లోనే పూర్తయిన ఇల్లు కూడా ఇంకా పేదలకు అందివ్వకుండా జాప్యం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. కొంతమంది అర్హులైన పేదలకు ఇల్లు నమోదు చేసుకోలేదు. మరి కొంతమందికి నమోదు చేసుకుని నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరలేదు. వాయిదాలు వేసుకుంటూ పోతున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు తేదీ అనౌన్స్ చేస్తే తప్ప పేదలకు ఇల్లు ఇచ్చేటట్లు లేదనిపిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో వర్షన్, పవన్, మణి, ప్రశాంత్ గౌడ్, కంథర్, ప్రసన్న, శరవణ, షాజహన్ తదితరులు పాల్గొన్నారు.

See also  జగన్నన్న ఇల్లు అతి పెద్ద స్కాం : ఆమదాలవలస జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు