దళిత సర్పంచ్ పై దాడిని ఖండించిన జనసేన నాయకులు

జనసేన

     ఆమదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గం పొందూరు మేజర్ పంచాయితీ సర్పంచ్ రేగిడి లక్ష్మిని పరామర్శించి దాడిని ఖండిచిన ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చేకా దళితులపై ఇలాంటి దాడులు నియోకవర్గస్థాయిలో సుమారు పది నుంచి పదిహేను జరిగాయి. కనీసం దాడులపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వైసీపీ ప్రభుత్వంలో దళితులను ఇంత చిన్నచూపు చూడటం సరైన పద్ధతి కాదని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోంచాడ. చిన్నమనాయుడు, కొంచాడ. సూర్య, గణేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

See also  మన ఊరిలో జనవాణి - నెల్లిమర్ల మండలం