
వార్తలు, (జనస్వరం) : కెనడా జనసేన టీం వారంతంలో నిర్వ్యహించే “Know Your Leader” కార్యక్రమంలో భాగంగా ఈ వారం జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి & చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తన తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కీర్తన పరిచయంతో స్టార్ట్ అయ్యిన ఈ కార్యక్రమం చివరిగా కెనడా జనసైనికుల Q&A సెషన్ తో ఎంతో విజయవంతంగా జరిగింది. మొదటగా కీర్తన పార్టీ కోసం చేస్తున్న కృషిని, మీడియాలో తన గళం విప్పుతూ ప్రత్యర్ధులను ఎదుర్కుంటున్న తీరును అభినందిస్తూ కెనడా జనసేన టీం ధన్యవాదములు తెలిపారు. కీర్తన కూడా విదేశాలలో ఉన్నా కూడా కెనడా జనసేన టీం పార్టీ అభివృద్ధి చేస్తున్న కంట్రిబ్యూషన్ ని మెచ్చుకోవడం జరిగింది. చివరిగా Q&A సెషన్ లో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు, జనసేన గెలుపు అవకాశాలు గురుంచి కీర్తన ని అడిగి తెలుసుకుని కెనడా జనసేన టీం నుండి తమవంతు సపోర్ట్ ఎల్లప్పుడూ చేస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ కి అండగా ఉంటామని తెలియజేసారు.








