ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లే దారికి మరమ్మతులు చేయండి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లే దారికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని జనసేనపార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. మండల నుంచి వచ్చే ప్రజలు వివిధ పనుల కోసం రోజు వందల మంది వస్తారని గుంతలమైన దారి వల్ల చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారని దీనికి తోడు దివ్యాంగులు కూడా తమ బండిని నడపలేక చాలా ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించి ఎమ్మార్వో ఆఫీస్ వెళ్లేదారిలో గుంతులు లేకుండా చేయాలని కోరారు.

See also  నెల్లూరులో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో 11 రోజు పవనన్న ప్రజాబాట