ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి : అక్కల గాంధీ

అక్కల గాంధీ

         మైలవరం ( జనస్వరం ) : ఇటీవల కృష్ణ నది వరద ప్రవాహానికి ముప్పుకు గురైన కొటికలపూడి, దామలూరు,చిలుకూరు, మూలపాడు, కేతనకొండ గ్రామాలకు చెందిన రైతులను కలసి వారితోపాటు పంటనష్టంవాటిల్లిన పొలాలను మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్  అక్కల రామ్మోహన్(గాంధీ) సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంవాటిల్లిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతలక్ష్మీ గారు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, కొటికలపూడి గ్రామ అధ్యక్షులు కట్టా శ్రీనివాస్, కళ్యాణ్, కొమ్మూరు వెంకటస్వామి, బాల, కొమ్మూరి హనుమంతరావు, ఎతి రాజుల ప్రవీణ్, సుజాత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

See also  బాసర ఐఐఐటి విద్యార్థులకు అండగా నిలిచిన ఆదిలాబాద్ జనసేన నాయకులు