సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన కోడుమూరు జనసేన నాయకులు

కోడుమూరు

            కోడుమూరు ( జనస్వరం ) :  సి.బెళగల్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇసుక మరియు ప్రజా రవాణాకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అలాగే రోడ్లు చాలా దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్నందువల్ల సి.బెళగల్ మండల ఎమ్మార్వో గారికి మరియు ఎంపీడీవో గారికి మెమొరాండం జనసేన నాయకులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో గారికి ఎంపీడీవో గారికి మెమోరాండం అందించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని లేదంటే జనసేన పార్టీ తరఫున రాస్తారోక మరియు రహదారి నిర్బంధం చేపడతామని తెలియజేస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. కావున ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి ఈ సమస్యను కచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కార్యనిర్వణ కమిటీ సభ్యులు శాలు భాష, నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, సి.లక్ష్మన్న, కె. కృష్ణ బాబు, ఎల్లప్ప, రాజు, గిరీష్, నాగరాజు, మద్దిలేటి, గోవిందు, శంకర్, సోమశేఖర్, సుంకన్న, పాణ్యం నియోజకవర్గ నాయకులు బి సుధాకర్ గారు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  రోడ్లు మరమ్మతులు చేపట్టాలని R&B అధికారులకు వినతిపత్రం ఇచ్చిన విజయనగరం జిల్లా జనసేన నాయకులు