శ్రీకాళహస్తిలో జనసేన పార్టీలోకి చేరికలు

శ్రీకాళహస్తి

          శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణంలో దాదాపు 100 మంది యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. స్థానిక S.R ఫంక్షన్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేసిన బాలాజీ, శంకర్, సాయి చందు గార్ల అధ్వర్యంలో యువత జనసేన పార్టీలో చేరారు. అందరికీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, జిల్లా అధ్యక్షులు Dr. పసుపులేటి హరి ప్రసాద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు Dr. హరి ప్రసాద్  హాజరు అయ్యారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు పార్థసారధి, ఆనంద్, త్యాగరాజులు, ఉమా మహేశ్వరి, భాగ్య లక్ష్మి, జ్యోతి, చందు చౌదరి, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.

See also  రైతు కష్టం.. వర్షార్పణం.. గొల్లప్రోలు బైపాస్ రోడ్ వద్ద నీట మునిగిన వరిచేలు. ఆదుకోవాలని కోరుతున్న జనసైనికులు