కార్వేటి నగరం, (జనస్వరం) : కార్వేటి నగరం మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుపతి ప్లీనరి సమావేశంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన సందర్బంగా పత్రికా ప్రతినిధులల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటఎత్తాలంటే మాటలు రాని ఉప ముఖ్యమంత్రి తిరుపతిలో మాట్లాడుతుంటే ఎంగిలి మింగి మాట్లాడాల్సిన అవసరం వుందా అని నేను అడుగుతున్నాను. ఏ నేరమూ చేయని నాయకుడు మా జనసేనాని అని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మహేషానికి కొమ్ములు విరగ్గొట్టి, కింద కూర్చోబెట్టి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత లేదని ఎద్దేవా చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో స్వామి మీ ఓటమి తప్పదని, డిపాజిట్ కూడా రాదని, రాజకీయ సన్యాసం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీశ్వరుడైన పవన్ కళ్యాణ్ ఆ స్థాయిని వదిలి, పేదల కోసం దిగి వచ్చిన ఆపద్భాంధవుడు. మా నాయకుడు నడిచి వస్తే మీరు తట్టుకోగలరా? మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే సంపద సృష్టించే సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారు అంటే కాపు నేస్తం లో నలభై ఒకవేల పేర్లు గల్లంతు చేశారని, రాజధాని భూములను అమ్ముతున్నారని, చీకటి జీవోలు జారీ చేస్తున్నారని, మధ్యలో ప్రమాదకరమైన రసాయనాలు కలిపి అమ్ముతున్నారని, దివ్యాంగుల పై దాడి చేస్తున్నారని, అమ్మ ఒడిని అపహాస్యం పాలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే పాలు నీళ్లు లేకుండా చేస్తున్నారని, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో పెరిగిపోతున్న అప్పులు, రెవెన్యూ లోటు తప్ప మీరు సాధించిన అభివృద్ధి ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల అభివృద్ధి చెందలేదని, ఎస్సీ కార్పొరేషన్ ఎక్కడ, ఆ నిధులు ఏమయ్యాయి, పేదలు విద్యావంతులు అయ్యారు ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఏమైంది? వైన్ క్యాలెండర్ తప్ప అని తీవ్రంగా విమర్శించారు. మహిళలను లక్షాధికారులను చేస్తామన్నారు, ఒక్క మహిళ అయినా ఈ నియోజకవర్గంలో లక్షాధికారి అయ్యారా అని ప్రశ్నించారు. పేదల ఆనందంగా లేరు, బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి కొనలేని పరిస్థితుల్లోనూ పోషక ఆహారాన్ని కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సిగ్గుగా ఉంది మిమ్మల్ని మాట్లాడటానికి, మీ ప్రభుత్వం గురించి చెప్పడానికి అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అంటే శక్తి, అజ్ఞానంతో కూడుకున్న శక్తి అని, పవన్ కళ్యాణ్ అంటే జ్ఞాన వికాసం, గత కాలపు తప్పులను సరిదిద్ది నవ యానం వైపు నడిపించడం అని, పవన్ కళ్యాణ్ అంటే త్యాగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తనను తాను అనిపించుకోవడం అని కొనియాడారు. సినిమాలు గ్రాఫిక్స్ తో కూడుకున్నవి అది వాస్తవం, దానిని అవకాశాలను చేయటం కాదు, సినిమాలు తీయడం ఎంత కష్టమో, అది తెలిసి కూడా తన కష్టార్జితాన్ని నిరుపేదల కోసం వెచ్చించడానికి వెనుకాడని దానవీర శూర కర్ణుడు పవన్ కళ్యాణ్ కర్ణుడు అని ఉద్గ్జాటించారు. మీ అభివృద్ధిని చూసి మా నాయకుడికి కళ్ళు మంట కాదు, కౌలు రైతులు విస్మరించిన మీ అసమర్థతను చూసి మాకు విస్మయం కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి వెన్నుముక రైతులు, కౌలు రైతులు, ఆ కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే మూడువేల మందికి పరిహారము ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మీద అని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని ఎవరూ పట్టించుకోక పోయినా నేను పట్టించుకుంటున్నాని చెప్పి 30 కోట్ల రూపాయలతో మూడు వేల మంది కౌలు రైతులను ఆదుకుంటున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని తెలిపారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడు కాదు, నాయకుడు. కథల నాయకుడు కాదు, ప్రజల నాయకుడని అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉన్నత వర్గం ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో మిమ్మల్ని ఓడించడం ఖాయం, 2023 ముందస్తు ఎన్నికలు వచ్చినా, 2024 సాధారణ ఎన్నికలు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, వెంకటేష్, బుజ్జి, ప్రధాన కార్యదర్శి నరేష్, నరసింహులు, నాయకులు కిషోర్, రాజమన్నార్, జనసైనికులు పాల్గొన్నారు.