అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం చేసిన ఐనవోలు జనసేన నాయకులు

     ఐనవోలు, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా, ఐనవోలు మండలం, నందనం గ్రామానికి చెందిన యాకర రమేష్ (28) అతనికి ఆరోగ్యం బాగా క్షీణించింది‌. అతనికి సర్జరీ చేసే స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఈ విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో నేమూరి శంకర్ (జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు) సూచన మేరకు ఐనవోలు మండల అధ్యక్షుడు బర్ల శివ తమవంతు సహాయంగా 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసైనికులు బర్ల ప్రవీణ్, ఆకులపెల్లి వీనయ్, ఆకులపెల్లి శ్రీకాంత్, బర్ల అజయ్, బీ.జానీ, బీ.మనోహర్, ఇసురం కర్ణకర్ తదితరులు పాల్గొన్నారు.

See also  అవస్థలో విద్యా వ్యవస్థ