అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న కడప జనసైనికులు

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న కడప జనసైనికులు

కడప జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పని చేస్తున్నటువంటి యస్.టి.ఓ.జి రవి కుమార్ గారు చేస్తున్న అక్రమాలపై జనసేన పార్టీ కడప నగర కమిటీ అధ్యక్షులు శ్రీ మాలే శివ గారు పత్రికా సమావేశం నిర్వహించారు. అంతులేని అవినీతికి కడప ట్రెజరీ కార్యాలయం నిలిచిందని మాలే శివ గారు అన్నారు. ఈ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి యస్.టి.ఓ.జి రవి కుమార్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని, అతని అనుచరులు సైతం అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల యొక్క పెన్షన్ వ్యవహారాలపై ఫైల్స్ ముందుకు కదలాలి అంటే లంచం ఇవ్వాలని బహిరంగంగా అడుగుతున్నారని వాపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సొంత కొడుకు దత్తత పేరుతో తన అత్త జి.పెంచలమ్మ గారి పెన్షన్ బెనిఫిట్స్ ని స్వాహా చేశారని మాలే శివ గారు చెప్పారు. రవి కుమార్ గారిపై వస్తున్న ఆరోపణల గురించి సమగ్రమైన విచారణ జరిపించమని ఉన్నతాధికారులు అధికారంగా పలు ధపాలుగా సంవత్సరాల తరబడి అధికారిక లేఖలు రాసినప్పటికి, స్పందించని కడప జిల్లా ట్రెజరీ శాఖ అధికారుల ఆగడం. రవి కుమార్ గారు ఉద్యోగంలో చేరినప్పటి నుండి మూడుసార్లు పదోన్నోతులు పొందినప్పటికి ఒక్కసారి కూడా ఈ జిల్లా నుండి ఒక జిల్లాకు నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ అవ్వకుండా అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని ట్రెజరీ శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. రవి కుమార్ గారు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు, విచారించి సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించబోతున్న తనపై అధికారి, అధికారి నాగరాజు గారిపై కార్యాలయంలో భౌతిక దాడి చేశారని, సదరు అధికారి లిఖిత పూర్వకంగా పోలీసులకు, జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడమే కాకుండా పత్రికా ముఖంగా ప్రకటించినప్పటికి జి. రవికుమార్ పై ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి అవినీతి సామ్రాజ్యానికి అధిపతిగా మారినటువంటి రవికుమార్ గారు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఆయన చేసిన ఆక్రమ ధనార్జనను రెవెన్యూ రికవరీ చేసి, చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టి ఉన్నతి స్థాయి విచారణ జరిపించాలని జనసేన పార్టీ కడప నగర అధ్యక్షుడు శ్రీ మాలే శివ గారు విజ్ఞప్తి చేశారు.

See also  పామిడి పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ