CBI దత్తపుత్రుడు జగన్ కు రైతులు అంటే చులకన భావం : తీగల చంద్రశేఖర్

CBI దత్తపుత్రుడు

      నెల్లూరు ( జనస్వరం ) : గూడూరు జనసేనపార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్షరూపాయల వంతున మొత్తం 30 కోట్లు ఇస్తుంటే అభినందించాల్సింది పోయి జనసేనాని మీద పడి ఏడవడం చూస్తుంటే జగన్ మోహన్రెడ్డి చేతకాని తనానికి, అసహనానికి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. జనసేనపార్టీ ద్వారా ఇప్పటి వరకు 200 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అన్నీ వ్యవస్థలు చేతిలో ఉన్నా, చనిపోయిన వాళ్లు రైతులో కాదో తెలియని స్థితిలో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను చూపడానికి మీలాగా, మా నాయకుడు “ఆత్మలతో” మాట్లాడేవారు కాదని, జనసేనపార్టీ ఆర్థికసాయం అందించిన వారి వివరాలు పోలీసు రికార్డ్స్ లో ఏమి రాసి ఉన్నాయో చూపిస్తామని, అలాగే ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను విచారిస్తే వారు రైతుల్లో కాదో తెలుస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం వైసీపీ తెచ్చిన చట్టం వల్ల, అలాగే కౌలు రైతు కార్డులు ఇవ్వకపోవడంతో కౌలురైతులకు రుణాలు, బీమా సదుపాయం అందడం లేదన్నారు. అలాగే రైతులను కులలవారిగా విభజించి లబ్ది చేకూర్చాలని చేసిన నిబంధనను తొలగించడంతో పాటు వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెట్టె ఆలోచనను విరమించుకోవలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు ఇంద్ర, స్వరూప్, సనత్, వసంత్, సాయి , మోహన్ పాల్గొన్నారు.

See also  సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి? జనసేన నాయకులు సాయిబాబా, దురియా