గుంటూరు, (జనస్వరం) : ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆడిపిల్లల మీద జరిగే హత్యలు, అత్యాచారాలకు నిరసనగా చేపట్టిన దీక్ష అసిన్ తుఫాన్ ప్రభావం వల్ల రద్దు చేయడం జరిగింది. ఈ దీక్షకు సంబంధించి త్వరలో కార్యాచరణ చేపడతాము అని గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ తెలిపారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సూదా నాగరాజు, పుల్లంసెట్టి ఉదయ్, కొట్టు రవి, బిందెలా నవీన్, పులిగడ్డ గోపి, నరేంద్ర సింగ్, మహంకాళి శ్రీనివాస్, sk. రజాక్, డి రామకృష్ణ, ఏ. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.