సోంపేట, (జనస్వరం) : నిత్యం తన వద్దకు ఆకలితో వచ్చే ఎంతో మందికి కడుపు నిండా భోజనం పెట్టి, వారి ఆకలి తీర్చి ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ గారిని స్మరించుకుంటూ ఈరోజు జింకిభద్ర గడ్డ (సోంపేట మండలం) దగ్గర బస్ స్టాండు ఆవరణలో జనసైనికులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మన ఊరిలో పారిశుధ్య వృత్తిలో ఉంటూ గ్రామ పారిశుధ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న మన గ్రామంలోని పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు వాళ్ళకు శాలువాలు కప్పి సత్కారం చేసి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.