బొడ్డపాలెంలో రాజ్యలక్ష్మి అమ్మవారి భక్తులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

     భీమిలి, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గంలో వెల్లంకి గ్రామపంచాయతీ, బొడ్డపాలెం గ్రామంలో రాజ్యలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి  స్ఫూర్తితో బొడ్డపాలెం జనసైనికులు ఆధ్వర్యంలో, గోవింద్ బాలు సమక్షంలో 400 మంది భక్తులకు అల్పాహారం ( ఇడ్లీ, ఉప్మా) పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ప్రారంభించగా ఉత్సవ కమిటీ పెద్దలు, గ్రామ యువకులు,  జనసేన పార్టీ మండల నాయకులు నాని, కృష్ణ, ప్రశాంత్, నర్సింగ్, స్థానిక జనసేన నాయకులు పెప్సీ రమణ, కృష్ణ, సర్దార్ రెడ్డి, గబ్బర్ సింగ్, వినోద్ రెడ్డి, శివారెడ్డి, సర్దార్, కళ్యాణ్, ఆకిరా, జానీ, మణికంఠ, m. శ్రీను, G. శ్రీను, ప్రసాద్ రెడ్డి, సురేష్, బంగారి మొదలగు జనసైనికులు పాల్గొన్నారు.

See also  వీరఘట్టం జనసేనపార్టీలో గిరిజన నేత నిమ్మల నిబ్రామ్ చేరిక