రావులపాలెం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గము రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో ప్రమాదవశాత్తు యార్లగడ్డ రత్నకుమారి, ములగలేటి ఇంద్ర, రాపాక కీర్తి, యార్లగడ్డ కావ్య, యార్లగడ్డ రాజేష్ లకు చెందిన గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి 17,100 రూపాయల ఆర్థిక సహాయం, 5 బియ్యం బస్తాలు వారికి సహాయం అందించారు.