అఖిల కర్ణాటక పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా సంఘం ఆధ్వర్యంలో పునీత్ రాజ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు

    కర్ణాటక, (జనస్వరం) : అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ, నవీన్, మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ గారు 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వృద్ధుల ఆశ్ర‌మాలు మరియు 19 గోశాల‌లు ఏర్పాటు చేయడం, మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, పునీత్ రాజ్ కుమార్ అభిమానులు పాల్గొన్నారు.

See also  గజపతినగరంలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరు.. మన ఆట - సంక్రాంతి సంబరాలు